ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 3:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మెడిపల్లి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థానా,

మెడిపల్లి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థానా,

        అర్జున్ సమాచారం ప్రతినిధి, కొమురం భీం(మేడిపల్లి) ఆగస్టు 18,

మెడిపల్లి: వాంకిడి నుంచి కాగజ్‌నగర్‌ వరకు HLB మార్గంలో అంకోశాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మెడిపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆయనతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, శాసన మండలి సభ్యులు దండే విఠల్, డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,జిల్లా కలెక్టర్‌ హారిత, పాల్గొన్నారు.

మెడిపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో,జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్, AMC చైర్మన్‌ మంగ, మండల అధ్యక్షుడు రాఘవ మురళి, మండల, జిల్లా స్థాయి నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.